పావు శాతమా? అర శాతమా?
ఇవాళ భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తన క్రెడిట్ పాలసీని ప్రకటించనుంది. మెజారిటీ బ్యాంకర్లు పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు. మరికొందరు అర శాతం పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావిస్తున్నారు. వివిధ బిజినెస్ పత్రికలు, న్యూస్ ఛానల్స్ వడ్డీ రేట్ల పెంపుపై సర్వేలు నిర్వహించాయి. మెజారిటీ సర్వేలు పావు శాతంపైనే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోఇది రెండో సమీక్ష ఇది. సోమవారం నుంచి సమావేశమౌతున్న మానిటర్ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. గత సమీక్షలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచలేదు. అయితే ఆర్బీఐ వైఖరిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ధరలు మండిపోతున్నా… ఆర్బీఐ స్పందించడం లేదని ఎగతాళి చేశారు. ముఖ్యంగా రీటైల్, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇవాళ వడ్డీ రేట్లను పెంచుతుందనే నేపథ్యంతో అనేక బ్యాంకులు గత వారం రోజుల నుంచి రెండోసారి వడ్డీ రేట్లను పెంచాయి.