టాటా గ్రూప్: కొనసాగుతున్న ర్యాలీ
టాటా గ్రూప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ 2025 సెప్టెంబర్‌కల్లా లిస్ట్ అవుతుందన్న వార్తలతో ఆ గ్రూప్ షేర్లలో ర్యాలీ వచ్చింది. మార్కెట్ డల్‌గా ఉన్నా టాటా గ్రూప్ షేర్లు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా టాటా కెమికల్స్ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా ఈ షేర్ 11 శాతంపైగా లాభపడింది. టాటా సన్స్‌లో వాటా ఉన్న టాటా కెమికల్స్‌తో పాటు ర్యాలీస్ ఇండియా, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్ షేర్లు ఇవాళ కూడా రెండు
శాతం నుంచి 4 శాతం దాకా పెరిగాయి. ర్యాలీస్ ఇండియా షేర్ 12.8 శాతం పెరిగింది. టాటా పవర్ 8.5 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 5 శాతం, టాటా టెక్నాలజీస్ షేర్ కూడా 5.7 శాతం చొప్పున పెరిగాయి. ఇక టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్జూమర్, ఇండియా హోటల్స్, ట్రెంట్ షేర్లు రెండు నుంచి4 శాతం దాకా పెరిగాయి.