నాన్ స్టాప్… మిడ్ క్యాప్ బ్యాంకులు
మిడ్‌క్యాప్ బ్యాంకుల్లో ర్యాలీ అప్రతిహతంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు వచ్చాక.. అంటే అక్టోబర్ నెలలో మొదలైన ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది. అనేక షేర్లు 52 వారాలా గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీతో సహా అనేక బ్యాంక్ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆ మాటకొస్తే ఎస్బీఐ కూడా మంచి దూకుడు మీద ఉంది. ఇవాళ కూడా క్రెడిట్ సూసే బ్రోకింగ్ సంస్థ పీఎస్‌యూ బ్యాంకుల పట్ల పాజిటివ్ నివేదిక ఇచ్చింది. ఎస్బీఐ టార్గెట్ రూ.720గా పేర్కొంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా టార్గెట్ రూ.220గా పేర్కొంది. అక్టోబర్ ఆరంభంలో రూ. 200 ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ ఇవాళ రూ. 318 వద్ద ట్రేడవుతోంది. అలాగే పీఎన్బీ రూ. 57ను తాకగా, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ 181 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌కు గట్టి మద్దతు లభిస్తోంది. ఈ బ్యాంక్ కూడా త్వరలోనే 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకనుంది.