For Money

Business News

స్థిరంగా మార్కెట్‌

ఆరంభంలో మార్కెట్‌ స్థిరంగా ఉంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్ కావడంతో పది గంటల ప్రాంతంలో కాస్త యాక్టివిటీ ఉండొచ్చు. ప్రస్తుతం నిఫ్టి 18540 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి రెడ్‌లో ఉన్నా మిగిలిన ప్రధాన సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇవాళ ఆటో షేర్లు కాస్త వెలుగులో ఉన్నాయి. అయితే చాలా వరకు కంపెనీ స్పెసిఫిక్‌ న్యూస్‌తో ఆయా షేర్లు ట్రేడవుతున్నాయి. స్పష్టంగా ఏ రంగానికి పెద్దగా మద్దతు లేదు. నిన్నటి నుంచి ఫర్టిలైజర్‌ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. పలు షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. క్రూడ్‌ ధరలు బాగా తగ్గాయి. నాలుగు సెషన్స్లో 11 శాతంపైగా తగ్గాయి. దీని కారణంగా పలు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో పాటు పిడిలైట్‌ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇంకా టైర్‌ షేర్లలో ఆసక్తి కొనసాగుతోంది.