For Money

Business News

90 డాలర్ల దిశగా క్రూడ్‌

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతుఊనే ఉన్నాయి. నిన్న రాత్రి బ్రెంట్‌ క్రూడ్‌ 2 శాతానికి పైగా పెరిగి 90 డాలర్ల ఎగువకు చేరింది. 89.22 డాలర్లకు చేరింది. తాజాగా 88.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌ చమురు ధర ఈ స్థాయికి చేరడం 2014 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. WTI క్రూడ్‌ కూడా రాత్రి 87.70 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా ప్రయత్నాలతో యూరప్‌లో టెన్షన్‌ నెలకొంది. రష్యా, గల్ఫ్‌ ప్రాంతాల నుంచి యూరప్‌కు ముడి చమురు సరఫరాకు అవాంతరంగా మారవచ్చన్న భయాందోళనలతో ఫ్యూచర్స్‌ మార్కెట్లో క్రూడ్‌ రేటు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది బ్రెంట్‌ క్రూడ్‌ 100 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది. అమెరికా ఫెడరల్‌ తాజా నిర్ణయం కారణంగా క్రూడ్‌ మున్ముందు పెరిగే అవకాశముంది. ఇదే సమయంలో డాలర్‌ మరింత బలపడటంతో భారత్‌ వంటి మనదేశాలకు క్రూడ్‌ వాస్తవ మరింత పెరిగినట్లవుతుంది.