అద్దెకు రైలు బోగీలు!
రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా.. బోగీలను లీజుకు ఇవ్వనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్ల పాటు లీజుకు ఇస్తామని, ఈ కాలంలో లీజుతో పాటు.. నిర్వహణ, పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల జరిగిన భారతీయ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయి సమావేశం తీర్మానించింది. అయితే కనీసం 16 బోగీలను ఏకకాలంలో లీజుకు తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధనను విధించింది. సినీ రంగంతో పాటు సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేవారి నుంచి డిమాండ్ రావొచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు బోగీలను లీజుకు తీసుకుంటాయని భావిస్తున్నారు. స్పందన ఎలా ఉంటుందో మరి.