For Money

Business News

స్విస్‌ బ్యాంకుల నుంచి మరింత సమాచారం

స్విస్‌ బ్యాంకులలో భారతీయులకు ఉన్న ఆస్తులు, డిపాజిట్ల వివరాలకు సంబంధించిన మరింత సమాచారం ఈ నెలలో భారత్‌కు అందనుంది. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాలతో పాటు ఆ దేశంలో వారికి ఉన్న స్థిరాస్తుల వివరాలు, వాటిపై వచ్చే ఆదాయ వివరాలను కూడా స్విట్జర్లాండ్‌ బ్యాంకులు ఈసారి భారత్‌కు అందించబోతున్నాయి. స్విట్జర్లాండ్‌లో భారతీయులుకు ఉన్న స్థిరాస్తుల వివరాలు, వాటిపై వచ్చే ఆదాయ వివరాలను ఆ దేశ బ్యాంకులు భారత్‌కు అందించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్‌ బ్యాంకులు ఏటా ఈ వివరాలు భారత్‌కు అందిస్తున్నాయి. అయితే ఆ దేశంలోని ఎన్‌జీఓలు, ఇతర సంస్థలకు భారతీయులు ఇచ్చే విరాళాలు, డిజిటల్‌ కరెన్సీల్లో పెట్టే పెట్టుబడుల వివరాలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు.