For Money

Business News

మోడీని బొక్కలో వేయడం పక్కా

కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, కచ్చితంగా బయట పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన అన్నారు. తనపై సీబీఐ కేసులు పెడతాం, ఈడీ కేసులు పెడతామని బెదిరిస్తున్నామని… దమ్ముంటే వేయమని ఆయన సవాలు విసిరారు. ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి బెదిరింపులకు తాము బెదిరే ప్రసక్తే లేదని… ‘మమ్మల్ని బొక్కలో వేయడం కాదు మిమ్మల్ని బొక్కలో వేయడం ఖాయమ’ని ఆయన అన్నారు. రఫెల్‌ కుంభకోణంలో అవినీతిని బయట పెడతామని, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెచ్చారు. రాహుల్‌ గాంధీ రఫేల్‌ కుంభకోణాన్ని బయటికి తెస్తే… తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని బీజేపీ అంటోందని కేసీఆర్‌ అన్నారు. ఇన్నాళ్ళ తరవాత అసలు దొంగతనం బయటపడుతోందని అన్నారు. ఈ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం వేల కోట్లు మిగిందని ఆయన ఆరోపించారు. 36 రఫైల్‌ విమానాలను 9.4 బిలియన్‌ డాలర్లకు మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, పక్కనే ఉన్న ఇండోనేషియా 45 రఫెల్‌ విమానాలను 8 బిలయన్‌ డాలర్లకు కొనుగోలు చేసిందన్నారు. ఈ కుంభకోణం బయట పడాలని అన్నారు.