For Money

Business News

కార్పొరేట్‌ గద్దలకు అప్పజెప్పడమే

పైకి ఆర్థిక సంస్కరణలు అని చెబుతున్నా… వీటి అసలు ఉద్దేశం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక సంస్కరణల గురించి కేంద్రం పదే పదే చెబుతున్నా… ప్రతిపాదిత చట్టం అసలు ఉద్దేశం విద్యుత్ రంగ ప్రైవేటీకరణనే అని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల బోర్డులకు కేంద్రం పంపిన నోటీసులలో, డాక్యుమెంట్లలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉందని ఆయన ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలను తీసుకు రావాలని… అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని.. సబ్సిడీ ఎత్తివేయాలని చెప్పినమాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. అంటే తమ రాష్ట్రం రైతులకు, బార్బర్‌ షాపులకు, పౌల్ట్రీతో పాటు అనేక రంగాలకు సబ్సిడీలు ఇస్తున్నామని.. వాటిని ఎత్తివేయమని ఎందుకు కేంద్రం అంటోందని ఆయన అన్నారు.