అప్పర్ సర్క్యూట్లో క్వింట్ డిజిటల్
సీఎన్‌బీసీ టీవీ 18 మాజీ ప్రమోటర్ రాఘవ్ బెహల్‌కు చెందిన క్వింట్ డిజిటల్ మీడియా కంపెనీ షేర్లు ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ముగిశాయి. క్వింట్ డిజిటల్‌కు చెందిన పరోక్ష అనుబంధ సంస్థ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (QBM)లో అదానీ గ్రూప్ మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ వార్తకు స్పందనకు ఇవాళ క్వింట్ డిజిటల్ మీడియా షేర్లు 20 శాతం పెరిగి రూ. 483.40 వద్ద ముగిసింది. నిన్న రూ. 402.85 వద్ద ముగిసింది. ఈ షేర్ బీఎస్ఈలో మాత్రమే లిస్టయింది. ఇవాళ కేవలం 12వేల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. ముకేష్ అంబానీ ప్రవేశించిన దాదాపు కొత్త రంగాల్లోకి అదానీ కూడా విస్తరించడం విశేషం. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన ముకేష్ అంబానీకి నెట్వర్క్ 18 అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌తో పాటు మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే.