For Money

Business News

అదరగొట్టిన పీవీఆర్‌, ఐనాక్స్‌

విలీన ప్రకటనతో పీవీఆర్‌, ఐనాక్స్‌తో పాటు ఐనాక్స్‌ మాతృ సంస్థ జీఎఫ్‌ఎల్‌ లిమిటెడ్‌ షేర్లు అప్పర్‌ సీలింగ్‌లో ప్రారంభమయ్యాయి. నిఫ్టి భారీ నష్టాల్లో ఉన్నా పీవీఆర్‌ పది శాతం లాభంతో ప్రారంభమైంది. PVR క్రితం ముగింపు రూ. 1821 కాగా, ఇవాళ ఓపెనింగ్‌లోనే రూ. 2003ని తాకింది. ఇపుడు 6 శాతం లాభంతో రూ. 1930 వద్ద ట్రేడవుతోంది. ఇక ఐనాక్స్‌ షేర్‌ క్రితం ముగింపు రూ. 469.7 కాగా, ఇవాళ రూ. 563ని తాకింది. ఇపుడు 13.4 శాతం లాభంతో రూ. 532.65 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ వద్ద నగదు నిల్వలు ఉన్నందు… విలీనంలో ఈ కంపెనీకి షేర్లు ప్రీమియంతో చెల్లించారు. దీంతో పీవీఆర్‌ కంటే ఐనాక్స్‌ షేర్‌ ధర భారీగా పెరిగింది. అలాగే ఐనాక్స్‌ లీజర్‌ కంపెనీ మాతృ సంస్థ GFL షేర్‌ కూడా ఇవాళ ఆకర్షణీయ లాభాలు పొందింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 78.60 కాగా, ఇవాళ రూ. 94.30కి చేరింది. అక్కడి నుంచి స్వల్పంగా తగ్గి 16.73 శాతం లాభంతో రూ. 91.75 వద్ద ట్రేడవుతోంది.