ల్యాంకో ప్లాంట్ కోసం పీఎస్‌యూల పోటీ
ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 1980 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్, అదానీల కంటే అధిక మొత్తం ఆఫర్ చేస్తూ ల్యాంక్ ప్లాంట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 36.48 కోట్ల డాలర్లను ఆఫర్ చేస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌లోని అమర్‌కాంతక్ వద్ద ఉన్న ల్యాంక్ పవర్ ప్లాంట్ కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ, ఎస్జేవీఎన్తో పాటు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లు పోటీ పడుతున్నాయని ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్ వార్త సంస్థ పేర్కొంది. ల్యాంకో గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో … ల్యాంక్ఇన్ఫ్రాకు చెందిన ఈ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారు. ఈ ప్లాంట్ టేకోవర్ కోసం పీఎఫ్సీ, ఆర్ఈసీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇందులో అయిదు యూనిట్లు ఉండగా, మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి… మరో రెండు ప్రారంభం కావాల్సి ఉంది. డీల్ కుదిరే పక్షంలో ల్యాంకక్ష అమర్కాంతక్లో ఎస్జేవీఎ్కుకు 40 శాతం వాటా దక్కే అవకాశముంది. అలాగే డీవీసికి పది శాతం వాటా దక్కనుంది. మిగిలిన 50 శాతం వాటాను పీఎఫ్సీ, ఆర్ఈసీలు సమానంగా పంచుకునే అవకాశముంది.