For Money

Business News

బైబ్యాక్‌ కోసం రూ.850 కోట్లు

ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బైబ్యాక్‌ ప్రతిపాదనకు పేటీఎం బోర్డు ఆమోదం తెలిపింది. అయితే దీని కోసం కేవలం రూ. 850 కోట్లు కేటాయించడంతో ఊసురోమన్నారు. ఈ బైబ్యాక్‌ను గరిష్ఠంగా ఆరునెలల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఒక్కే షేర్‌ ధర రూ. 810 చొప్పున స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా ఓపెన్‌ మార్కెట్‌ మార్గంలో ఈ షేర్లను కొనుగోలు చేయాలని పేటీఎం నిర్ణయించింది. బైబ్యాక్‌ ట్యాక్స్‌లు, ఇతర లావాదేవీల ఖర్చులను కలుపుకుంటే ఒక్కో షేర్‌కు రూ. 810లను కంపెనీ చెల్లించవచ్చు. ధర, ఎంత మొత్తం వెచ్చించాలో కంపెనీ నిర్ణయించింది. ఈ లెక్కన కంపెనీ మార్కెట్‌ నుంచి 1,04,93,827 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో ఇది 1.62 శాతానికి సమానం.