For Money

Business News

‘ప్రీమియర్‌ పద్మిని’ ‘ కంపెనీ వేలం

రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో అయిదు దశాబ్దాల ప్రీమియర్‌ ఆటోమొబైల్‌ కంపెనీని అమ్మకానికి పెట్టారు. వేలం ప్రక్రియలో పలు కంపెనీలు పాల్గొన్నా.. చెన్నైకి చెందిన ఫ్యాబ్‌ మెటల్స్‌కు ఈ కంపెనీ దక్కింది. 1964లో ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పడిన ఈ కంపెనీ ఆరంభంలో దేశ ఆటోమొబైల్ రంగంలో చరిత్ర సృష్టించింది. టాప్‌ త్రీ కార్లలో ఉండేది. 14వ శతాబ్దపు రాజ్‌పూత్‌ రాణి పద్మిని’  పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కార్లు ముంబైలో ట్యాక్సిలుగా కూడా రికార్డు సృష్టించాయి. ఆర్థిక సంస్కరణలు, మారుతీ రాకతో ఆటోమొబైల్‌ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వెంటనే ఈ కంపెనీ మారకపోవడంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. 2013 పర్యావరణ నిబంధన పేరుతో 20 ఏళ్ళకుపై బడిన కార్లను మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో పద్మిని కార్లు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరకు కంపెనీ ఖాయిలా పడటంతో ఎన్‌సీఎల్‌టీ వేలానికి పెట్టింది. పుణెలోని చించ్వాడ్‌లోని 27 ఎకరాల కార్ల తయారీ యూనిట్‌తో పాటు మొత్తం కంపెనీని చెన్నైకి చెందిన ఫ్యాబ్‌ మెటల్స్‌ తీసుకుంది.