For Money

Business News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని

దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ఇండియా మెుబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 5 జీ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో యావత్‌ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్​టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. రిలయన్స్‌ తరఫున ముఖేష్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీ, ఎయిర్‌ టెల్‌ నుంచి సునీల్ మిటల్‌, వోడాఫోన్‌ ఐడియా తరఫున కుమార మంగళం బిర్లా పాల్గొన్నారు. 5 జీ సేవల గురించి ఆకాశ్‌ అంబానీ ప్రధాని మోడీకి వివరించారు.
13 నగరాల్లో …
5జీ నెట్‌వర్క్ మొదట 13 నగరాల్లో ప్రారంభించారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగారల్లో 5G నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వస్తాయి. తరవాత ఇతర నగరాలకు విస్తరిస్తారు.