19న పిరమల్ ఫార్మా షేర్ల లిస్టింగ్
పిరమల్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీని విడగొట్టి పిరిమల్ ఫార్మాను ప్రత్యేక కంపెనీగా మార్చిన విషయం తెలిసిందే. పిరమల్ ఫార్మాను ఈ నెల 19న లిస్ట్ చేస్తున్నట్లు బీఎస్‌ఈ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ షేర్ ముఖ విలువ రూ.10గా ఉంటుందని తెలిపింది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా గత ఆగస్టు నెలలో పిరమల్ ఫార్మాను ప్రత్యేక కంపెనీగా విడగొట్టారు. ఈ డీమర్జర్‌కు ఆగస్టు 12న ఎన్‌సీఎల్‌టీ కూడా ఆమోదం తెలిపింది.