సుప్రీం కోర్టుకు అదానీ కేసు
అదానీ గ్రూప్ కంపెనీలను కుదిపేస్తున్న హెండేన్‌బర్గ్ రీసెర్చి నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అమెరికా షార్ట్ సెల్లర్ అయిన హెండేన్‌బర్గ్ నివేదికతో అదానీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడం తెలిసిందే. ఇవాళ అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ఇవాళ కూడా 25 శాతం క్షీణించింది. హెండేన్‌బర్గ్ నివేదిక తప్పుల తడక అని, అందులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని అదానీ గ్రూప్ అంటున్నా … ఇప్పటి వరకు ఆ సంస్థపై ఎలాంటి దావా వేయలేదు. అయితే ఎంఎల్ శర్మ అనే లాయర్ ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అదానీ గ్రూప్‌పై నివేదిక విడుదల చేసిన హెండేన్‌బర్గ్ రీసెర్చి నివేదికపై విచారణ జరిపించేందుకు కేంద్రం, సెబీకి ఆదేశించాలని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు.