For Money

Business News

నిరాశపర్చిన దివీస్‌ ల్యాబ్‌

డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ దారుణ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 307 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ. 902 కోట్లతో పోలిస్తే నికర లాభం 65 శాతం క్షీణించింది. ఇదే సమయంలో కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ కూడా 31 శాతం క్షీణించి రూ. 1707 కోట్లకు పడింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ రూ. 2,493 కోట్లు. ఇతర ఆదాయం మాత్రం రూ. 16 కోట్ల నుంచి రూ. 114 కోట్లకు చేరింది. కోవిడ్‌ సంబంధిత ఔషధాలకు డిమాండ్‌ భారీ తగ్గడమే కంపెనీ నిరుత్సాహ పనితీరుకు కారణమని తెలుస్తోంది. కంపెనీ దారుణ ఫలితాలకు స్పందిస్తూ షేర్‌ రూ. 2795కి పడింది. అంటే 15 శాతం క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని 11.50 శాతం నష్టంతో రూ. 2891 వద్ద ముగిసింది.