For Money

Business News

మన దగ్గరే పెట్రోల్‌ ధర ఎక్కువ

దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా… శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. పొరగు దేశాల కన్నా మన దేశంలో పరిస్థితి బాగుందనే ప్రచారం బాగా జరుగుతోంది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్స్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే… చైనా, బ్రెజిల్, జపాన్, అమెరికా, రష్యా, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకంటే మన దేశంలో పెట్రోల్‌ ధర అధికమని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణ చేసినట్లు బీఓబీ పేర్కొంది. ‘ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 106 దేశాల సమాచారం ప్రకారం , భారత్లో పెట్రోల్ ధర లీటరుకు 1.35 డాలర్లు. ఈ క్రమంలో 42 వ స్థానంలో నిలిచింది. అయితే, భారత్ కంటే మరో 50 దేశాల్లో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర సరాసరి 1.22 డాలర్లుగా ఉంద’ని బీఓబీ నివేదిక వెల్లడించింది. హాంకాంగ్, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, నార్వే దేశాల్లో మాత్రం ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర 2 డాలర్లుగా ఉంది. ఇక తలసరి ఆదాయంతో పోల్చిచూస్తే .. వియత్నాం. కెన్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, వెనిజువెలా కంటే భారత్లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి . భారత్, టర్కీ దేశాల్లో లీటరు పెట్రోల్ ధర 1.35 డాలర్లు, జపాన్‌ మాత్రం 1,25, చైనాలో 121 డాలర్లు కాగా అమెరికాలో లీటరు పెట్రోల్ ధర 98 సెంట్లుగా ఉంది. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ లీటరు పెట్రోల్ ధర 1.05 డాలర్ల, పాకిస్థాన్‌ 77 సెంట్లు కాగా శ్రీలంకలో 67 సెంట్లుగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.