ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఇవాళ అనూహ్యం కొన్ని నిమిషాలపాటు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 140 డాలర్లను తాకింది. ఇది 13 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఒకవైపు డాలర్, మరోవైపు క్రూడ్ పెరగడంతో మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలు మూట గట్టుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా అనధికారికంగా ఆపింది. 123 రోజుల క్రితం క్రూడ్ ధర 68.87 డాలర్లు ఉండేది. కాని ఈ ఏడాది ఆరంభం నుంచి క్రూడ్ భారీగా పెరుగుతూ వచ్చింది. దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఈ నష్టాలను రాబట్టుకోవాలంటే పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.15 పెంచాల్సి ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటున్నారు. కేవలం తమ నష్టాలను పూడ్చుకోవడం కోసం మాత్రమే ఈ పెంపుదల అని ఈ కంపెనీలు అంటున్నాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఈ కంపెనీలు పెంచుతాయని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ పెంపుదల దశలవారీగా ఉంటుందని స్పష్టం చేసింది.