విమానాలకన్నా బైక్ ఇంధనం ఖరీదు
ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చలు భారీగా పెరుగుతున్నాయి. తాజా పెంపుతో విమానాల పెట్రోల్ కన్నా… బైక్ పెట్రోల్ ధర 33 శాతం అధికంగా మారింది. అంటే విమానంలో ప్రయాణం కంటే ఆటో ప్రయాణం చాలా ఖరీదన్నమాట. ఇవాళ్టి పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.77కు చేరింది. ఇక డీజిల్ ధర కూడా రూ. 100 దాటింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో డీజిల్ ధరల రూ. 100 దాటింది. రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతమైన గంగానగర్‌లో పెట్రోల్ రూ. 117.86లకు అమ్ముతుండగా, డీజిల్‌ను రూ. 105.96లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయిస్తున్నాయి. అంటే బైక్ నడిపేందుకు వాడే పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం రూ. 118లకు అమ్ముతుండగా.. విమానాలు నడిపేందుకు వాడే పెట్రోల్ (ఏటీఎఫ్)ను రూ. 79లకు అమ్ముతోంది. ఏటీఎఫ్ తాజా కిలో లీటర్ అంటే 1,000 లీటర్ల ధర రూ. 79,020.