For Money

Business News

నేడు పెట్రోల్‌, డీజిల్‌ డీలర్ల సమ్మె

ఇవాళ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ డీలర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరు ఇవాళ అంటే ఒక రోజు పాటు పెట్రోల్‌ , డీజిల్‌ కొనుగోలు చేయరాదని నిర్ణయించారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ సమ్మె చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఆలి దారూవాలా తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఎక్సైజ్‌ సుంకాలను భారీగా తగ్గించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పెట్రో డీలర్లు పేర్కొన్నారు. అంతకు ముందే కొనుగోలు చేసిన స్టాక్‌ను తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందన్నారు. 2017 జూన్‌ నుంచి కేంద్రం 8 సార్లు అర్ధరాత్రి ప్రకటనలు చేసిందని, అందులో ఐదుసార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి, డీలర్లను నష్టాల్లో ముంచేసిందని వాపోయారు.తమ కమీషన్‌ను పెంచమని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2017లో డీలర్లకు కమీషన్‌ పెంచారు. ఇవాళ కేవలం డీలర్లు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ కొనడం లేదు. పెట్రోల్‌ పంపులు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. వినియోగదారులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు.