For Money

Business News

హైదరాబాద్‌లో డీజిల్‌ ధర రూ.100.13

దేశంలో చమురు ధరలు రికార్డు స్ధాయిలో పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజాగా గురువారం మరోమారు సామాన్యడిపై భారం మోపాయి. పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 103.24, డీజిల్‌ ధర రూ.91.77కు చేరింది. ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.109.25‌, డీజిల్‌ ధర రూ.99.55గా ఉంది. కోల్‌కత్తాలో పెట్రోల్ ధర రూ.103.94, డీజిల్ ధర రూ. 94.88కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.100.75, లీటర్ డీజిల్ రూ. 96.26గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. లీటర్ పెట్రోల్‌ ధర రూ.107.41కు పెరిగింది.