అందుకే అదానీ షేర్లు పడ్డాయి
ప్రధాని మోడీకి, అదానీ గ్రూప్‌నకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని జనం నమ్మారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీకి, అదానీకి సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టర్లు నమ్మడం వల్లే… బీజేపీ ఓటమి తరవాత ఇన్వెస్టర్లు అదానీ షేర్లను భారీగా అమ్మారని రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరవాత స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇన్వెస్టర్ల సంపద ఇవాళ ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయల మేర తగ్గింది. ముఖ్యంగా అదానీ గ్రూప్‌లోని ప్రధాన షేర్లు 20 శాతం దాకా నష్టంతో ముగిశాయి. ఇవాళ లోక్‌సభ ఎన్నికలు వెల్లడి కాగా, బీజేపీ తనకు తానుగా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానాలు లభించలేదు. టీడీపీ, జేడీయూల సాయం తప్పనిసరిగా మారింది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లు వెత్తాయి.