For Money

Business News

పీబీ ఫిన్‌టెక్‌: షేర్లు కొనేవారు లేరు

పాలసీ బజార్‌, పైసా బజార్‌ మాతృసంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్‌ షేర్లకు ఇవాళ కొనేవారు లేకపోవడం విచిత్రం. షేర్‌ ఇవాళ పది శాతంపైగా పడింది. అయినా ఇంకా అర కోటి షేర్లు అమ్మకానికి ఉన్నాయి. పీబీ ఫిన్‌టెక్‌ కంపెనీ ప్రమోటర్లయిన యాషిస్‌ దహియా, అలోక్‌ బన్సల్‌లు.. తమ షేర్లలో 1.08 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టారు. వీటి విలువ సుమారు రూ. 1000కోట్లు. ఎసాప్స్‌కు సంబంధించిన పన్ను చెల్లించాల్సి ఉన్నందున ఈ షేర్లను అమ్ముతున్నట్లు వారు చెప్పారు. భారీ సంఖ్యలో షేర్లు అమ్మకానికి రావడంతో ధర తగ్గుతూ పోయింది. 10.59 శాతం తగ్గి రూ. 776.15కి చేరింది. అయినా కేవలం 53 లక్షల షేర్లు మాత్రం అమ్ముడుబోయాయి. 2021 నవంబర్‌లో ఈ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించింది. అదే నెలలో ఈ షేర్‌ రూ.1,470ని తాకింది. కేవలం మూడు నెలల్లో షేర్‌ ధర సగానికి పడిపోయింది.