For Money

Business News

తగ్గిన బాస్మతి బియ్యం ఎగుతులు

అమెరికా ఆంక్షలు కారణంగా ఇరాన్‌ నుంచి భారత దేశం క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోళ్ళు ఆపేసింది. దీని ప్రభావం బాస్మతి బియ్యం ఎగుమతులపై పడింది. దీంతో బాస్మతి బియ్యం ఎగుమతులు నాలుగేళ్ళ కనిష్ఠ స్థాయికి క్షీణించాయి. సాధారణం భారత్‌కు రూపాయల్లో ఆయిల్‌ను అమ్మే ఇరాన్‌ తన వద్ద ఉన్న భారత కరెన్సీతో వ్యవసాయ ఉత్పత్తులు, బియ్యం వంటివి కొనుగోలు చేసేది. భారత్ ఆయిల్ కొనడం మానేసిన తరవాత ఇరాన్‌ వద్ద భారత కరెన్సీ లేకపోవడంతో బాస్మతి దిగుమతులను ఆపేసింది. 2020తో పోలిస్తే 2021లో బాస్మతి బియ్యం ఎగుమతి 20 శాతం తగ్గింది. ఇరాన్‌కు బాస్మతి ఎగుమతులు 26 శాతం తగ్గాయి.ఏటా 40 లక్షల టన్నుల బాస్మతి బియ్యంను భారత్ ఎగుమతి చేస్తుంది. సాధారణ బియ్యాన్ని దక్షిణాఫ్రికా దేశాలకు, బాస్మతి బియ్యాన్ని గల్ఫ్‌ దేశాలకు భారత్‌ ఎగుమతి చేస్తుంది. గత ఏడాది అకాల వర్షాల కారణంగా బాస్మతి పంట విస్తీర్ణం బాగా తగ్గింది. దీంతో ఇపుడిపుడే బాస్మతికి డిమాండ్ పెరుగుతోంది.