పేమెంట్ అగ్రిగేటర్‌కు మళ్ళీ దరఖాస్తు
పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసిన పేటీఎంకు చుక్కెదురైంది. తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్) ద్వారా పేమెంట్ అగ్రిగేటర్ కోసం పేటీఎం దరఖాస్తు చేసింది. పీపీఎస్ఎల్కు అసవరమైన నిధులను పేటీఎం ఇస్తుంది. దీనికి సంబంధించి మరోసారి ఆమోదం తీసుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేటీఎంను ఆదేశించింది ఆర్బీఐ. 120 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాని పేర్కొంది. అలాగే కొత్తగా ఆనఖ్లైన్ మర్చంట్స్‌ను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందిస్తూ.. కేవలం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ కోరిందని పేర్కొంది. ఇపుడు ఆన్‌బోర్డులో ఉన్న మర్చంట్స్‌కు ఆఫ్‌లైన్‌లో తాను పేమెంట్స్ కొనసాగిస్తానని… ఆర్బీఐ కొత్త ఆదేశాల వల్ల తనకు కొత్తగా వచ్చిన ఇబ్బంది లేదని తెలిపింది. పేమెంట్ అగ్రిగేటర్స్గా రేజర్ పే, పైన్ ల్యాబ్స్, క్యాష్‌ఫ్రీ, సీసీ అవెన్యూస్లు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. బిల్డిస్క్, పేయూలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. వీటి రాకతో ఈ రంగంలో పోటీ పెరిగింది. పేటీఎం ఈ రంగంలోకి రావడానికి మరింత ఆలస్యం కావొచ్చు. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దని గత మార్చిలో ఆర్బీఐ ఆదేశించింది.అయితే ఈ నిషేధాన్ని ఆర్బీఐ ఇంకా ఎత్తేయలేదు.
పేమెంట్ అగ్రిగేటర్ అంటే… వ్యాపార సంస్థలు, ఈ కామర్స్ సంస్థలకు పేమెంట్ సర్వీసులు అందించడం. కస్టమర్ల నుంచి నిధులు తీసుకుని… వాటన్నింటిని కలిపి ఆయా సంస్థలకు నిర్ణీత సమయంలో చెల్లిస్తారు. ఇపుడు ఈ సర్వీసులను పేమెంట్ ఆఫ్‌లైన్‌లో చేస్తోంది. ఇది ఆన్లైన్లో అందించడానికి పేటీఎం దరఖాస్తు చేసుకుంది.