For Money

Business News

అకాల వర్షాలతో పెరిగిన ఉల్లి ధర

గత కొన్ని రోజులు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో ఉల్లి పంట కూడా ఉంది. అలాగే ఉల్లి రవాణాకు కూడా ఇబ్బందులు ఏర్పడటంతో మార్కెట్‌లో ధర పెరిగింది. లసన్‌గావ్‌లో ఉల్లి ధర ఒక వారంలో రూ.12నుంచి 17లకు పెరిగింది. నిన్న మార్కెట్‌లో సాధారణ రకం రూ.8, నాణ్యమైన ఉల్లి ధర రూ. 23 పలికింది. నాణ్యమైన ఉల్లి హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.30 దాకా పలుకుతోంది. గత నెలలో కూడా రూ. 15 నుంచి రూ.20 ఉన్న ఉల్లి ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి.