For Money

Business News

పడినా… 17100పైనే నిలబడింది

అదే ట్రెండ్‌ ఇవాళ కూడా. పడి లేవడం. పెరిగి పడటం. మొత్తానికి 16900-17200 మధ్య కదలాడటం. గత కొన్ని రోజులుగా నిఫ్టి చేస్తున్న పని ఇదే. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా నిఫ్టి హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం 17112ని తాకిన నిఫ్టి తరవాత మిడ్ సెషన్‌కు ముందు 16956 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. యూరో మార్కెట్లు గ్రీన్‌ ప్రారంభం కావడం… చాలా వరకు సూచీ అర శాతంపైగా పెరగడంతో నిఫ్టి కూడా కోలుకుని వంద పాయింట్లకు పైగా పెరిగింది. కాని స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో ఆ లాభాలను దాదాపు కోల్పోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే 109 పాయింట్ల నష్టంతో 17014 వద్ద ముగిసింది. ఇవాళ అమెరికా ద్రవ్యోల్బణ రేటు వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకున్నారు. నిఫ్టితో పోలిస్తే ఇతర అన్ని సూచీలు అధిక నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ 1.26 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి మిడ్ క్యాప్‌ దాదాపు ఒక శాతం క్షీణించింది. ఇవాళ చాలా వరకు సిమెంట్‌ షేర్లు క్షీణించాయి. ముఖ్యంగా ఇండియా సిమెంట్‌ ఇవాళ కూడా ఆరు శాతం క్షీణించింది. ఇక నిఫ్టిలో 36 షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 3 శాతం పెరగ్గా, విప్రో ఏడు శాతం దాకా నష్టపోయింది. ఉదయం లాభాల్లో ఉన్న అదానీ పోర్ట్స్‌ క్రమంగా నష్టాల్లోకి జారుకుని…రెండు శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇవాళ చాలా మంది అనలిస్టులు ఎస్‌బీఐ షేర్‌ను షార్ట్‌ చేయమని సలహా ఇచ్చారు. ఈ షేర్‌తో పాటు ఎస్‌బీఐ లైఫ్‌ కూడా రెండు శాతంపైగా నష్టపోయాయి. గత కొన్ని సెషన్స్‌ నుంచి వీక్‌గా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇవాళ కూడా నష్టపోయింది.జొమాటొ ఇవాళ కూడా మూడు శాతం తగ్గింది. గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో ముందుకు సాగిన ఇండియా హోటల్స్‌ ఇవాళ నాలుగు శాతం తగ్గింది. అలాగే అస్ట్రాల్‌ పైప్స్‌ కూడా బాగా క్షీణించింది. నిఫ్టి బ్యాంక్‌లోని 12 షేర్లూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2 శాతంపైగా నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది.