For Money

Business News

ఎస్‌బీఐ పుట్‌ కొనండి

మార్కెట్‌ కొద్దిసేపట్లో క్లోజ్‌ కానుంది. రేపటి ట్రేడింగ్‌ను దృష్టి పెట్టుకుని కొన్ని రెకమెండేషన్లు ఇవి.
టెక్నిక్‌ అనలిస్ట్‌ మానస్‌ జైస్వాల్‌ ఎస్‌బీఐ షేర్‌ అక్టోబర్‌ 520 పుట్‌ను కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. ఇపుడు ఈ పుట్‌ ఆప్షన్‌ రూ.10.75 వద్ద ట్రేడవుతోంది. రూ. 8 స్టాప్‌లాస్‌తో రూ. 20 టార్గెట్‌తో ఈ పుట్‌ను కొనాలని సిఫారసు చేస్తున్నారు. మరో అనలిస్ట్‌ అమిత్‌ సేథి మారికో అక్టోబర్‌ ఫ్యూచర్‌ను రూ. 515 వద్ద కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. స్టాప్‌లాస్‌ రూ.509, టార్గెట్‌ రూ. 526గా పేర్కొంటున్నారు. రాజేష్‌ పాల్వియా ఇచ్చిన రెకమెండేషన్‌ రైట్స్‌ (RITES)ను కొనుగోలు చేయమని. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 384 వద్ద ట్రేడవుతోంది. రూ. 376 స్టాప్‌లాస్‌తో రూ. 395 లేదా రూ.400 టార్గెట్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు.