ఇక సబ్సిడీ ఎరువులు ఇలానే …
వన్ నేషన్, వన్ ఫర్టిలైజర్ పేరుతో కేంద్ర ప్రబుత్వం సబ్సిడీతో ఇచ్చే యూరియాను ఒక బ్రాండ్‌తో విడుదల చేయనుంది. దీన్ని ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియా దేశ వ్యాప్తంగా భారత్ యూరియా అనే బ్రాండ్‌తో సరఫరా చేస్తారు. అలాగే నానో యూరియాను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. యూరియా, డై అమ్మోనియా ఫాస్పేట్ (డీఏపీ) మ్యురేట్ ఆఫ్ ఫాస్పేఫేట్ (ఎంఓపీ) ఎన్‌పీకేలు కూడా భారత్ బ్రాండ్‌తో సరఫరా చేస్తారు. దేశంలోని 33 లక్షల ఎరువుల రీటైల్ దుకాణాలను దశలవారీగా పీఎం కేఎస్‌కేలుగా (ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం) మార్చుతారు.