ఒమైక్రాన్ BA2తో నాల్గవ వేవ్?
అనేక దేశాల్లో ఇపుడు ఒమైక్రాన్ ఉప వేరియంట్ BA2 కేసులు పెరుగుతున్నాయి. ఇపుడు చైనా బెంబేలెత్తిపోతున్నది ఈ వేరియంట్ గురించేనని వార్తలు వస్తున్నాయి. ఒమైక్రాన్ కన్నా ఫాస్ట్‌గా విస్తరించే గుణం ఉన్న ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేదని తెలుస్తోంది. తీవ్రత విషయంలో దాదాపు ఒమైక్రాన్ లాగే BA2 వేరియంట్ ఉన్నట్లు తెలుస్తోంది. చైనా అవలంబిస్తున్న జీరో కోవిడ్ విధానం కారణంగా గత రెండేళ్ళలో చైనాలో ఎక్కడా పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే BA2 వేరియంట్ చైనా అధికారులను చమటలు పెట్టిస్తోంది. అమెరికాలో BA2 కేసులు పెరుగుతున్నట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. మార్చి 12నాటికి అమెరికాలో నమోదైన ఒమైక్రాన్ కేసుల్లో ఉప వేరియంట్ BA2 కేసులు 23.1 శాం ఉన్నట్ల పేర్కొంది. ఈకేసుల సంఖ్య బాగా పెరుగుతోందని వెల్లడించింది. వ్యాధి తీవ్రత విషయంలో ఒమైక్రాన్‌కు భిన్నంగా లేదని CDC పేర్కొంది. అమెరికాతో పాటు ఆసియా, యూరప్‌లో ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు జర్మనీ కూడా తమ దేశంలో BA2 కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది.