For Money

Business News

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి ఓలా

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం కొత్తగా ఓలా కార్స్‌ను ప్రారంభించింది. సెకండ్ హ్యాండ్​ కార్లను కస్టమర్ ​ఇంటికే డెలివరీ చేయనుంది. అలాగే నెలసరి వాయిదాలు, ఓ సంవత్సరం వారంటీ లాంటి సదుపాయాలు కూడా కల్పించనుంది. ఓలా కార్స్ ప్లాట్​ఫామ్​లో యూజర్ల కార్లను అమ్మవచ్చు.. కొనవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​కు ప్రస్తుతం మంచి ఊపు ఉండడంతో ఓలా ఈ సర్వీస్​ను ప్రారంభించింది.