For Money

Business News

గ్రే మార్కెట్‌లో NSE జూమ్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్‌ ఆఫర్‌కు లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు త్వరలోనే ఎన్‌ఓసీ ఇస్తామని సెబీ ఛైర్మన్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో అనధికార మార్కెట్‌ (గ్రే మార్కెట్‌)లో ఎన్‌ఎస్‌ఈ షేర్‌ ధర అనూహ్యంగా పెరుగుతోంది. మే 22వ తేదీన రూ. 1800 ఉన్న NSE షేర్‌ కేవలం వారంలో అంటే మే 28వ తేదీన రూ. 2300లకు పెరిగింది. అంటే 28 శాతం పెరిగిందన్నమాట. దీంతో NSE అనధికార మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 5.6 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో NSE లోని అత్యధిక మార్కెటలైజేషన్‌ ఉన్న టాప్‌ టెన్‌ కంపెనీల్లో NSE చేరింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మార్కెట్‌ క్యాపిటలజైషన్‌ ఉన్న స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో టాప్‌ 5లో ఎన్‌ఎస్‌ఈ చేరింది.

Leave a Reply