ఇక జియో, ఎయిర్‌టెల్‌దే రాజ్యం
ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ…అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా ఈ వాటా బదిలీ తరవాత కంపెనీలో వొడాఫోన్, ఆదిత్య బిర్లా కంపెనీలు మైనారిటీ వాటాదారులు అయిపోతారు. అంటే అతి పెద్ద వాటాదారు ప్రభుత్వమే. పరోక్షంగా చెప్పాలంటే కంపెనీ తీసుకునే ఈ కీలక నిర్ణయమైనా ప్రభుత్వం ఆమోదం తోనే. సింపుల్‌గా చెప్పాలంటే మరో బీఎస్ఎన్ఎల్ కాబోతోంది. జియో, ఎయిర్‌టెల్‌తో పోటీగా లేదా వాటిని ఛాలెంజ్ చేసే స్కీములు, ఆఫర్లు ఇక ఉండవన్నమాట. ఏజీఆర్ డ్యూస్ అంశం బయటికి తెచ్చిందే దీనికోసమే అన్న చర్చ టెలికాం రంగంలో నడుస్తోంది. పైకి తన పాత్ర లేనట్లుగా నటిస్తూనే… చివరికి టెలికాం రంగంలో కేవలం రెండు కంపెనీలే ప్రభుత్వం పావులు కదిపినట్లు తెలుస్తూనే ఉంది. మోడీకి రిలయన్స్ కంపెనీలో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీ ఎయిర్టెల్ ఇటీవల బీజేపీకి ఇచ్చిన ఎన్నికల డొనేషన్స్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. వెరశి ఈ రెండు కంపెనీలు యూపీ ఎన్నికల తరవాత తమ అసలు స్వరూపం బయటపెడతాయి. ఈ ఏడాది చార్జీలను భారీగా పెంచుతామని ఎయిర్టెల్ అపుడే బహిరంగంగా చెప్పేసింది.