For Money

Business News

ఎన్‌డీటీవీలో అదానీకి మెజారిటీ వాటా

న్యూఢిల్లీ టెలివిజన్‌లో మెజారిటీ వాటాలను అదానీ గ్రూప్‌ వశమైంది. ఇది వరకే చెప్పినట్లు ఛానల్‌ ప్రమోటర్లు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లు తమ 27.26 శాతం వాటాను అదానీలకు అమ్మేశారు. ఎన్డీటీవీలో వీరిద్దరికి 32.26 శాతం వాటా ఉంది. ఇందులో 5 శాతం వాటాను వారు కొనసాగించనున్నారు. ఇవాళ బ్లాక్‌ డీల్‌ విండో ద్వారా డీల్‌ను పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. ఒక్కో షేరుకు రూ.342.65 చొప్పున మొత్తం 1.75 కోట్ల విలువైన షేర్లకు గానూ రూ.602.30 కోట్లను రాధికా, ప్రణయ్‌ రాయ్‌లకు చెల్లించినట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది.