For Money

Business News

పామాయిల్‌ ధరలకు రెక్కలు?

ఈ ఏడాది ఆరంభంల తమ దేశం నుంచి పామాయిల్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేషియా మళ్ళీ అదే బాట పట్టనుంది. దేశీయంగా పామాయిల్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసేందుకు వచ్చే ఏడాది మూడు నెలలకు గాను కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం ఎగుమతిదారులు దేశీయంగా ఎంత పామాయిల్‌ను విక్రయిస్తారో… దానికి ఆరు రెట్లు మాత్రమే ఎగుమతి చేయాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం దేశీయంగా అమ్మే పామాయిల్‌కు ఎనిమిది రెట్లు ఎగుమతి చేసుకునే అవకాశముంది. కొత్త నిబంధనలు జనవరి నుంచే అమల్లోకి వస్తాయి. ఇది కూడా తాత్కాలికమేనని… ఎప్పటికపుడు పరిస్థితి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇండోనేషియా అధికారులు అంటున్నారు. భారత్ అత్యధికంగా పామాయిల్‌ను ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకొంటోంది. ఇండోనేషియా తాజా నిర్ణయంతో మన దిగుమతులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. దిగుమతులు తగ్గితే… వెంటనే దాని ప్రభావం ధరలపై పడుతుంది.