For Money

Business News

కొత్త పార్లమెంటు భవనం మార్చిలో ప్రారంభం?

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు పాత భవనంలో ప్రారంభమై… కొత్త భవనంలో ముగుస్తాయి. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తరవాత … పార్లమెంటుకు కొన్ని రోజులు సెలవు ఉంటుంది. ఈలోగా బడ్జెట్‌లో ఉన్న అంశాలను అన్ని పార్టీలు అధ్యయనం చేసేందుకు వీలు ఉంటుంది. తరవాత రెండో సెషన్‌లో బడ్జెట్‌ చర్చ జరిగిన తరవాత ఆమోదం తెలుపుతారు. బడ్జెట్‌ సమావేశాలు జనవరి చివర్లో అంటే 30వ తేదీ లేదా 31న ప్రారంభం అవుతాయి. ప్రారంభ రోజున రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 8 లేదా 9న బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడతాయి. ఈ సమావేశాల తరవాత అంటే బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తరవాత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం మార్చిలో ఉంటుందని ప్రస్తుత సమాచారం. బడ్జెట్‌ కొనగింపు సమావేశాలు మార్చి రెండో వారంలో కొత్త భవనంలో ప్రారంభం అవుతాయన్నమాట. బడ్జెట్‌‌ ఆమోదం కూడా అక్కడే. అంటే 2022-23 ఏడాది బడ్జెట్‌ పాత భవనంలో ప్రవేశ పెడితే… కొత్త భవనంలో ఆమోదిస్తారన్నమాట.