For Money

Business News

1వ తేదీ నుంచి స్వల్పంగా పెంపు

జనవరి 1వ తేదీ నుంచి చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను నామమాత్రంగా పెంచింది ప్రభుత్వం. అయితే టైమ్‌ డిపాజిట్లపై ఒక శాతం పెంచింది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ప్రతి మూడు నెలలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తోంది. పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ (పీపీఎఫ్‌) పై మాత్రం పైసా కూడా పెంచలేదు. బయటి మార్కెట్‌లో డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ఒక ఏడాది, రెండేళ్ళు, మూడేళ్ళతో పాటు అయిదేళ్ళ టైమ్‌ డిపాజిట్లపై ఒక శాతం వరకు వడ్డీని పెంచింది. ఇక సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌ వడ్డీ రేట్లలో మార్పు లేదు. కిసాన్‌ వికాస్‌ పత్రపై 7 శాతం నుంచి 7.2 శాతానికి, నేషనల్‌ సేవింగ్‌ స్కీమ్‌పై కూడా 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. స్కీమ్‌ల వడ్డీ రేట్లు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.