ఈసారి సౌత్‌కు వరుణుడు షాక్?

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా చూస్తే… నైరుతీ రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతవరణ విభాగం (IMD) వెల్లడించింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ -LPG -పద్ధతిలో వర్షపాత శాతం 96 లేదా 104 ఉంటుందని పేర్కొంది. అయితే వాతావరణం మార్పులు (Climate Change) కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈఏడాది నైరుతి రుతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్యంతోపాటు వాయువ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని IMD పేర్కొంది. ఉత్తర భారతంతోపాటు, ఉత్తర భారత్‌కు ఆనుకుని ఉన్న మధ్య భారత్‌తో పాటు వాయువ్య భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. సాధారణంగా ఏప్రిల్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి నైరుతి రుతుపవనాల ప్రభావాన్ని అంచనా వేస్తామని, మే నెల చివర్లో అప్‌డేట్ చేస్తామని IMD పేర్కొంది.