For Money

Business News

ప్యూచర్‌ రీటైల్‌పై దివాలా పిటీషన్‌

అమెజాన్‌, రిలయన్స్‌, ఫ్యూచర్స్‌ రీటైల్‌ మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో ఫ్యూచర్‌ రీటైల్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకులు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (NCLT)ని ఆశ్రయిస్తున్నాయి. తనకు రావాల్సిన రుణాల వసూలు కోసం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇవాళ ఫ్యూచర్‌ రీటైల్‌పై NCLTలో దివాలా పిటీషన్‌ వేసింది. ఫ్యూచర్‌ రీటైల్‌ నుంచి బ్యాంకుకు రూ. 1078 కోట్ల రుణం వసూలు కావాల్సి ఉంది.ఈ కంపెనీకి ఇచ్చిన రుణ మొత్తాన్ని బ్యాంకు లాభాల నుంచి ప్రొవిజన్‌ చేసింది. ఇపుడు NCLTని ఆశ్రయించింది.