For Money

Business News

ఈసారి సాధారణ వర్షపాతం

ప్రైవేట్‌ వాతావరణ అంచనా సంస్థ స్కయ్‌మెట్‌ ఈ ఏడాది కూడా వర్షపాతం సాధారణంగా ఉంటుందని పేర్కొంది. ఖరీఫ్‌ సీజన్‌కు పక్కా అంచనా ఏప్రిల్‌ నెలలో విడుదల చేస్తామని, అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక గణాంకాలను విశ్లేషిస్తూ ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. సమగ్ర నివేదిక ఏప్రిల్‌ నెలలో విడుదల చేస్తామని పేర్కొంది. గత రెండు సంవత్సరాల్లో అంటే 2020, 2021లో ఎల్‌ నినాను చూశామని.. ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి ఉండకపోవచ్చిని స్కయ్‌మెట్‌ వెదర్‌ అధ్యక్షుడు ఏవీఎం జీపీ శర్మ తెలిపారు.

(file photo)