For Money

Business News

ఎయిర్‌పోర్టులో యూజర్‌ చార్జీలు 70% పెంపు

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌)ను భారీగా పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) అనుమతించింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులు ఈ చార్జీలు 70 శాతం దాకా పెరుగాయి. దేశీయ ప్రయాణం చేసే ప్యాసింజర్ల నుంచి ఇపుడు రూ.281 వసూలు చేస్తున్నారు. దీన్ని రూ. 480కు పెంచుతారు. అంతర్జాతీయ ప్రయాణం చేసేవారి నుంచి వసూలు చేసే ఫీజును రూ.393 నుంచి రూ. 700లకు పెంచుతారు. ఆ తరవాత 2025 డిసెంబర్‌ 31 లోపు దేశీయ ప్రయాణీకుల నుంచి రూ. 750, విదేశీ ప్రయాణం చేసే ప్యాసింజర్ల నుంచి రూ.1500 వసూలు చేసుకునేందుకు అనుమతించారు.