For Money

Business News

వీటికి జీఎస్టీ మినహాయింపు ఉంటుంది

ప్యాక్‌ చేయకుండా విడిగా అంటే లూజ్‌గా అమ్మే ఆహార వస్తువులు, పప్పు ధాన్యాలు, లేబుల్ లేకుండా అమ్మినా జీఎస్టీ మినహాయంపు కొనసాగుతుంది. అయితే బ్రాండెడ్‌ అనే పదానికి అర్థం మార్చారు. బ్రాండెడ్‌ లేదా ప్రి ప్యాకేజ్డ్‌ లేదా లేబుల్ వేసి ఉన్న ఆహార వస్తువులను కూడా బ్రాండెడ్‌ పరిధిలోకి తెచ్చారు. అంటే ఏదైనా తినుబండారం ప్యాక్‌ చేయకుండా అమ్మితే జీఎస్టీ ఉండదు. అదే ఏదో ఒక పేరు పెట్టి ప్యాక్‌ చేసి అమ్మితే జీఎస్టీ ఉంటుంది. బ్రాండుతో అమ్మే పప్పు ధాన్యాలు, ఆహార వస్తువులపై ఇపుడున్న 5 శాతం జీఎస్టీ కొనసాగుతంది.
వీటికి జీఎస్టీ పెంపు

ఎల్‌ఈడీ ల్యాంపులు, కత్తులు, ఇంకు, బ్లేడ్లు,విద్యుత్‌తో నడిచే పంపులు, డయరీ మెషినరీలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు
పప్పు ధాన్యాల మిల్లింగ్‌ మెషిన్స్‌పై జీఎస్టీ 5 శాతం నుంచి 18 శాతానికి పెంపు
సోలార్‌ వాటర్ హీటర్‌, ఫినిష్డ్‌ లెదర్‌ వస్తువులపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి
ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు చేసే కాంట్రాక్టులపై జీఎస్టీ 18 శాతానికి పెంపు