For Money

Business News

కాఫీ డే – టాటా కన్జూమర్‌… నో డీల్‌

ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన కాఫీ వెండింగ్‌ మెషిన్‌ కంపెనీ కాఫీ డేను కారు చౌకగా కొనేయాలని చూసిన టాటా కన్జూమర్‌ యత్నాలు ఫలించలేదు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన కాఫీ డే టేకోవర్‌కు రెండేళ్ళ క్రితం టాటా కన్జూమర్‌ మొగ్గు చూపింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ఈలోగా కాఫీడే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుటంతో కంపెనీ వ్యాల్యూయేషన్‌ గురించి విభేదాలు మొదలయ్యాయి. 2019 మార్చి నాటికి కాఫీ డే ఖాతాల్లో ఉన్న రుణ భారం రూ.7000 కోట్లు కాగా, ఇపుడు ఆ రుణ భారం రూ.1800 కోట్లకు తగ్గింది. దీంతో కంపెనీ వ్యాల్యూయేషన్‌ పెరిగింది. అయితే పెరిగిన వ్యాల్యూయేషన్‌కు కాఫీడేను కొనేందుకు టాటా కన్జూమర్‌ వెనకడగు వేసింది. దీంతో కాఫీ డే టేకోవర్‌ యోచనను విరమించుకుంది.