క్రిప్టో కరెన్సీ తెచ్చే ఉద్దేశం లేదు
కేంద్ర ప్రభుత్వానికి క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీలను జారీ చేయడం లేదన్నారు. ఆర్బీఐ చట్టం 1994 ప్రకారం తెస్తున్న కరెన్సీని మాత్రమే కేంద్ర బ్యాంకు జారీ చేస్తోందని స్పష్టం చేశారు. ఇపుడు కాగిత రూపంలో వస్తున్న కరెన్సీకే త్వరలో డిజిటల్ రూపం ఇవ్వబోతున్నట్లు .. దాన్ని ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ‘ గా పేర్కొంటున్నట్లు మంత్రి తెలిపారు.