For Money

Business News

లాభాల్లోకి వచ్చిన నిఫ్టి

ఉదయం ఒకదశలో 17476 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చింది. ఉదయం 17643ని తాకిన తరవాత దాదాపు 200 పాయింట్లు క్షీణించింది నిఫ్టి. రష్యా నుంచి గ్యాస్‌, ఆయిల్ సరఫరా పునరుద్ధరణ వార్తలతో యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. జర్మనీ డాక్స్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. నష్టాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌ కూడా కోలుకున్నాయి. దీంతో నిఫ్టి 46 పాయింట్ల లాభంతో 17589 వద్ద ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక నిఫ్టిలో టాప్‌ లూజర్‌ శ్రీసిమెంట్‌. ఈ నెలాఖరులో ఈ షేర్‌ నిఫ్టి నుంచి వైదొలగుతున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నా… లాభాలన్నీ అర శాతంలోపే ఉన్నాయి. మున్ముందు అమెరికా ఫ్యూచర్స్‌ను బట్టి నిఫ్టి క్లోజింగ్‌ ఆధారపడి ఉండే అవకాశముంది.