స్థిరంగా కొనసాగుతున్న నిఫ్టి
ఉదయం నుంచి నిఫ్టి నష్టాల్లోనే కొనసాగుతోంది. పడిన ప్రతిసారీ మద్దతు అందడంతో స్వల్ప లాభాలతో ఉంది. ఒకదశలో 17215ని తాకిన ఇపుడు 17283 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌లో కాస్త ఒత్తిడి వచ్చినా.. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ కూడా ఒక మోస్తరు నష్టాలతో ఉండటంతో నిఫ్టి నిలకడగా ఉంది. యూరో మార్కెట్లు ఏమాత్రం కోలుకున్నా… నిఫ్టిగ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గడం మార్కెట్‌కు కాస్త కలిసొచ్చే అంశం. నిఫ్టి గెయినర్స్‌లో ఇపుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్‌లో ఉంది. ఈ షేర్ రెండు శాతంపైగా నష్టపోయింది. అలాగే ఎన్‌టీసీపీ కూడా రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక నష్టాల్లో యూపీఎల్, హీరోమోటార్స్ నిఫ్టి టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. నిజానికి నిఫ్టి కన్నా నిఫ్టి నెక్ట్స్ పటిష్ఠంగా ఉంది. ఉదయం ఈ సూచీ నష్టాల్లోకి వెళ్ళినా… వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆపుడు కూడా గ్రీన్‌లో ఉంది. జొమాటొ 18 శాతంపైగా పెరగడం ఒక కారణంగా కాగా బ్యాంక్ బరోడాతో పాటు ఇతర షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి.