భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
చాన్నాళ్ళ తరవాత మిడ్ క్యాప్ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఒత్తిడి కేవలం నిఫ్టి షేర్లకే పరిమితమైంది. కాని తొలిసారి మధ్య తరహా షేర్లలో కన్పిస్తోంది. నిజానికి అదానీ గ్రూప్ షేర్లకు ఇంకా మద్దతు ఉండటంతో సూచీలు భారీ నష్టాల నుంచి తప్పించుకున్నాయి. ఉదయం 17820ని తాకిన నిఫ్టి మిడ్ సెషన్కల్లా 17638 పాయింట్లకు క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 227 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా షేర్లు రెండు శాతం లాభపడగా, మిగిలిన షేర్లు స్వల్ప లాభాలకే పరిమితమైంది. నిఫ్టి నెక్ట్స్ 1.63 శాతం క్షీణించగా, నిఫ్టి మిడ్ క్యాప్ 1.82 శాతం నష్టపోయింది. 0.55 శాతం నష్టంతో ట్రేడవుతున్న బ్యాంక్ నిఫ్టి… నిఫ్టిని కొంత మేర కాపాడిందని చెప్పాలి. తప్పుడు సమాచారం మార్కెట్లో ఉన్నా.. షేర్ భారీగా పెరుగుతున్నా మిన్నకున్న వేదాంత… నిన్న సాయంత్ర క్లారిటీ ఇవ్వడంతో ఇవాళ షేర్ 7 శాతంపైగా నష్టపోయింది. మార్కెట్ ఉదయం భారీ నష్టాల నుంచి కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.. యూరో మార్కెట్ల పతనం చూసేసరికి ఇన్వెస్టర్లు అమ్మకాలు పెంచారు. యూరో మార్కెట్లు 1.5 శాతం దాకా క్షీణించాయి. అమెరికా ఫ్యూచర్స్ సూచీలు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.