నిలకడగా నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నా నిఫ్టి ఉదయం నుంచి నష్టాల్లోనే ఉంటోంది. ఒకదశలో 15710 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 15780 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 51 పాయింట్లు లాభంతో ట్రేడవుతోంది. ఉదయం పలు ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే క్లోజింగ్ సమయానికల్లా అన్ని మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. దీనికి కొనసాగింపుగా యూరో మార్కెట్లు కూడా గ్రీన్లో ప్రారంభమయ్యాయి. ప్రధాన మార్కెట్లన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. మరి మన మార్కెట్లు క్లోజింగ్కల్లా తేరుకుంటాయా.. లేదా ఇదే స్థాయిలో ముగుస్తాయా అన్నది చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్లో ఉండటం మార్కెట్లకు పాజిటివ్ అంశం.